రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలి

ABN , First Publish Date - 2021-01-13T06:15:16+05:30 IST

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలువాలని రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.లక్ష్మినర్సింహారెడ్డి అన్నారు.

రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలి
రక్తదాన శిబిరంలో పాల్గొన్న డాక్టర్‌ లక్ష్మినర్సింహారెడ్డి

రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

మోత్కూరు/ ఆలేరు, జనవరి 12: రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలువాలని రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.లక్ష్మినర్సింహారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ, బీజేవైఎం, ఆర్‌ఎ్‌సఎస్‌, భజరంగ్‌దళ్‌, జీఎల్‌ఎన్‌రెడ్డి యువసేన ఆధ్వర్యంలో మంగళవారం శారదా క్లినిక్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ఎంపీడీవో పి.మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో 64 యూనిట్ల రక్తం సేకరించారు. ఆలేరులో ఫ్రెండ్స్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు రవీందర్‌, ప్రతినిధులు మోదీన్‌, నరే్‌షనాయక్‌, నరేందర్‌, వినోద్‌నాయక్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

48 సార్లు రక్తదానం చేసిన సుబ్రహ్మణ్యశర్మ

రిటైర్డు ఉపాధ్యాయుడు సుబ్రమణ్యశర్మ మోత్కూరులో నిర్వహించిన రక్తదానం శిబిరంలో రక్తదానం చేసి 48వ సారి రక్తదానం చేసిన వ్యక్తిగా నిలిచారు. మరో ఉపాధ్యాయుడు టి.ఉప్పలయ్య ఈ శిబిరంలో 25వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏపీవో కరుణాకర్‌, ఆయా సంస్థల ప్రతినిధులు కె.ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎన్‌చారి, శ్రీనివా్‌సరెడ్డి, గౌరు శ్రీనివాస్‌, బి.రాజు, బి.చంద్రశేఖర్‌, ఎం.అంజయ్య, మత్స్యగిరి, దశరథ, కె.మహేందర్‌, జి.సోమనర్సయ్య, జితేందర్‌రెడ్డి, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T06:15:16+05:30 IST