యాసంగిలో వరి సాగు వద్దు : విప్‌ సునీత

ABN , First Publish Date - 2021-11-09T06:40:36+05:30 IST

ధాన్యం కొనుగోళ్లకు కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఈ యాసంగి వరి పంట వేసుకోవద్దని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత రైతులను కోరా రు.

యాసంగిలో వరి సాగు వద్దు : విప్‌ సునీత
తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

తుర్కపల్లి, నవంబరు 8: ధాన్యం కొనుగోళ్లకు కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఈ యాసంగి వరి పంట వేసుకోవద్దని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత రైతులను కోరా రు. మండలంలోని చిన్నలక్ష్మాపూర్‌(పీఎసీఏస్‌), మాదాపూర్‌ (ఐకేపీ) గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభిం చి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇప్పటివరకు కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. వరి సాగు కు ప్రత్యామ్నాయంగా రైతులు పప్పు, నూనె ధాన్యాల పంటల సాగు చేసుకోవాలని కోరారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీలరవీందర్‌నాయక్‌, జడ్పీ వైస్‌చైర్మన ధనావత బీకునాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, పీఎసీఏస్‌ చైర్మన నర్సింహరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

భువనగిరిరూరల్‌: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలంలోని బీయనతిమ్మాపురం, బస్వాపురం, వడపర్తి, అనాజీపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా, మండల కోఆర్డినేటర్లు కొలుపుల అమరేందర్‌, కంచి మల్లయ్య, ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు  రమేశ, పరమేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ బీరుమల్ల య్య, మాజీ పీఏసీఎస్‌ చైర్మన సత్తిరెడ్డి, సర్పంచులు కృష్ణారెడ్డి, కవిత, మం జుల, లత, ప్రేమలత, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-09T06:40:36+05:30 IST