ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-05-05T06:48:53+05:30 IST

అన్నదాత ఆగ్రహం కట్టలు తెగింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముదామంటే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం చెందారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెట్టొద్దు

రోడ్డుపై ధాన్యం తగులబెడుతున్న రైతులు

చింతపల్లి, మే 4: అన్నదాత ఆగ్రహం కట్టలు తెగింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముదామంటే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం చెందారు. రహదారిపై ధాన్యం పోసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. చింతపల్లి మార్కెట్‌ యార్డుకు, ఐకేపీ కేంద్రాలకు ధాన్యం విక్రయించడానికి తెస్తే సకాలంలో కాంటాలు వేయడంలేదని రైతులు వాపోయారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు మండలకేంద్రంలోని రహ దారిపై రాస్తారోకో చేశారు. చింతపల్లి, నసర్లపల్లి, వర్కాల, ఘడి యాగౌరారం, నెల్వలపల్లి, తేదేడు గ్రామాలకు చెందిన సుమారు వందమంది రైతులు చింతపల్లిలోని మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రానికి, నసర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చారు. వారం రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహించారు. ధాన్యాన్ని వెం టనే కొనుగోలు చేయాలని రైతులు అధికారులను కోరారు.  నస ర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మిల్లులో ధాన్యం నిల్వలు నిండి పోయాయని, లారీలు కూడా సమయానికి రావడంలేదని అధికా రులు రైతులతో చెప్పారు. వర్షం వస్తే తమ ధాన్యం తడిసి ముద్ద వుతుందని తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడెక్కారు. మండలకేంద్రంలో ధాన్యాన్ని తగలబెట్టి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు రైతులతో చర్చించారు. ఆ యన మండల వ్యవసాయ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. మి ల్లులో స్టాక్‌ ఉన్నందువల్లనే ధాన్యం కొనుగోలు చేయలేకపోయా మని, బుధవారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని అధికా రులు హమీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. 

Updated Date - 2021-05-05T06:48:53+05:30 IST