ధాన్యం కొనుగోలులో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-11-09T06:49:38+05:30 IST

ధాన్యం కొనుగోలు చయడంలో ఏలాంటి అసత్వం వహించరాదని, అలా ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ వి చంద్రశేఖర్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలులో అలసత్వం వద్దు
అన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖి చేస్తున్న అదనపు కలెక్టర్‌

  అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

నల్లగొండ రూరల్‌, నవంబరు 8 :  ధాన్యం కొనుగోలు చయడంలో ఏలాంటి అసత్వం వహించరాదని, అలా ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ వి చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం  నల్లగొండ, కనగల్‌ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అధికంగా ఉండడం చూసి రోజుకు 8 లారీలు ధాన్యం కాంటా వేయాలని, అందుకు కావాల్సిన హమాలీలను ఏర్పాటు చేయాలని సెంటర్‌ ఇన్‌చార్జిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పకుండా ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాసుబుక్‌, పట్టాదారు పాస్‌బుక్‌ జీరాక్స్‌ కాపీలు వెంట తెచ్చుకోవాలని రైతులకు సూచించారు.  ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సహ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, డిఆర్‌డిఓ డిపిఎం అరుణ్‌ ఉన్నారు. 


Updated Date - 2021-11-09T06:49:38+05:30 IST