ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-11-30T07:05:26+05:30 IST

మునుగోడు పెద్దవాగు నుంచి ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ

ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వొద్దు
మునుగోడులో రాస్తారోకో చేస్తున్న రైతులు

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

మునుగోడు, నవంబరు 29: మునుగోడు పెద్దవాగు నుంచి ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అసలే కరువు పీడిత ప్రాంతమని, ఇక్కడ ఎలాంటి సాగునీటి వనరులు లేవన్నారు. సాగయ్యే పంటలకు వర్షాధారమేనన్నారు. ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలోని వాగుల నుంచి ఇతర ప్రాంతాలకు స్యాండ్‌ ట్యాక్సీ ద్వారా ఇసుకను తరలించడం సరికాదన్నారు. దీంతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నా రు. స్థానిక అవసరాలకు మినహా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించవద్ద సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, కార్మికులు అధిక సంఖ్య లో రాస్తారోకోలో పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కురుమిద్ది ముత్త య్య, మునుగోటి బ్రహ్మయ్య, పందుల చిన్నలింగయ్య, ప్రతాప్‌, పందుల నర్సింహ, రాజారామ్‌, సురిగి చలపతి, గురిజ రామచంద్రం, వెంకటేశ్వర్లు, లాలు, పందుల పర్వతాలు, బండారి శంకర్‌, సైదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T07:05:26+05:30 IST