నిర్వాసితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-06-22T06:58:39+05:30 IST

యాదాద్రిలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన సోమవారం వచ్చిన సీఎం కేసీఆర్‌ అంజనీపురి కాలనీ నిర్వాసితులు చూసి కాన్వాయ్‌ ఆపి సమస్యలను అడిగితెలుసుకున్నా రు.

నిర్వాసితులకు న్యాయం చేయండి

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన సోమవారం వచ్చిన సీఎం కేసీఆర్‌ అంజనీపురి కాలనీ నిర్వాసితులు చూసి కాన్వాయ్‌ ఆపి సమస్యలను అడిగితెలుసుకున్నా రు. నిర్వాసితుల ప్రతినిధి మిట్ల వీరేశ్‌గౌడ్‌ను తన వెంట కొండపైకి తీసుకువెళ్లి నిర్వాసితులు కోరినట్టు ఇంటిస్థలం అందజేస్తారని తెలిపారు. పక్కనే ఉన్న అధికారులతో మాట్లాడుతూ, యా దాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రహదారి విస్తరణ, తదితర అవసరాల కోసం భూసేకరణ సమసంలో నిర్వాసితులకు ముందుగా చెప్పినట్టు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2021-06-22T06:58:39+05:30 IST