ఈటలను బర్తరఫ్‌ చేయడం దుర్మార్గం

ABN , First Publish Date - 2021-05-05T06:43:26+05:30 IST

ఈటల రాజేందర్‌పై కుట్ర పన్ని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడం దర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్‌ ఆరోపించారు.

ఈటలను బర్తరఫ్‌ చేయడం దుర్మార్గం
చిట్యాల మండలంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

నల్లగొండ క్రైం/ మిర్యాలగూడ టౌన్‌/ నాంపల్లి/ మాడ్గులపల్లి/ చిట్యాల రూరల్‌/ మునుగోడు రూరల్‌/ కనగల్‌/దేవరకొండ/, మే 4: ఈటల రాజేందర్‌పై కుట్ర పన్ని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడం దర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్‌ ఆరోపించారు. ప్రభుత్వం, సీఎం తీరును నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే నిరసన తెలిపారు.  బీసీల ఓట్లతోనే గెలిచి బీసీలను బర్తరఫ్‌ చేయడం దారుణమ న్నారు. కార్యక్రమంలో నాయకులు శేరి రవీందర్‌, ఎలిజాల వెంకటేశ్వర్లు, శ్రీరంగం ఉన్నారు. మిర్యాలగూడలో బీసీ మహిళా సం ఘం నేతలు బంటు కవిత, సందెనబోయిన జయ మ్మ, మండల సావిత్రి దీక్ష చేపట్టారు. నాంపల్లిలో మండల కేంద్రంలో ముది రాజ్‌ సంఘం, వివిధ సంఘల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొ మ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయ కులు పూల వెంకటయ్య, ఏస్‌కే చాంద్‌పాష, సింగారపు గిరి, పూల శంకర్‌, కోరే సాయురాం, పూల యాదగిరి, కామనబోయున యాదగిరి, కర్నే యాదయ్య, దమోదర్‌ వెంకటయ్య పాల్గొన్నారు. మాడ్గులపల్లిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి భూపతి నరేష్‌గౌడ్‌ మా ట్లాడారు. బీసీల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఈటెల రాజేందర్‌పై ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి తొలగించడం అన్యాయమ న్నారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, విజయ్‌, శంకర్‌, సాయి, మహేష్‌, సైదులు పాల్గొన్నారు. చిట్యాల మండలం వని పాకలలో ముదిరాజ్‌ సంఘం నాయకులు కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో పీక వెంకన్న, గుడిసె యాద య్య, గుడిసె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మునుగోడులో జరిగిన సమావే శంలో నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్‌ మాట్లాడారు. ఈటల రాజేందర్‌ మంత్రి పదవిలోకి తీ సుకోవాలన్నారు. కనగల్‌ మండలంలోని బచ్చన్నగూడెంలో ముది రాజ్‌ మహాసభ యువజన విభాగం, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కట్ట శ్రీను పాల్గొన్నారు ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయడాన్ని నిరసిస్తూ దేవరకొండ మండలం కొ మ్మెపల్లిలో బీసీ విద్యార్ధిసంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతపల్లి సతీష్‌గౌడ్‌, తిరుపతయ్య, సైదులు, శివ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T06:43:26+05:30 IST