టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి : విప్‌ సునీత

ABN , First Publish Date - 2021-02-27T05:12:19+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి : విప్‌ సునీత
విద్యార్థులకు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే

రాజాపేట, ఫిబ్రవరి 26: టీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. రాజాపేటలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. అంతకు ముందు రాజాపేట ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థులకు భవిష్యత్‌ ప్రణాళికపై సూచనలు చేశారు. అనంతరం బేగంపేట గ్రామానికి చెందిన బోగ హరినాథ్‌ రచించిన ‘రజాకారుల దాడిలో మా అక్క సమిధ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ చామకూర గోపాల్‌, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సందెల భాస్కర్‌, బాల నర్సయ్య, హరినాథ్‌, రాజేశ్వర్‌, ఈశ్వరమ్మ, సోమలింగం, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:12:19+05:30 IST