ప్రతీవార్డులో రూ.30లక్షలతో అభివృద్ధి
ABN , First Publish Date - 2021-10-25T05:56:22+05:30 IST
జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ సమగ్ర అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరిటౌన, అక్టోబరు 24: జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ సమగ్ర అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో ఒ క్కో వార్డుకు రూ.30 లక్షలు కేటాయించి 35 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నట్లు, క్రీడా వసతులు కల్పించనున్నట్లు, పట్టణ అభివృద్ధికి అవసరమైన అన్ని ప నులను చేపట్టనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. జడ్పీచైర్మన ఎలిమినేటి సందీ ప్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అ ర్హులైన అందరికీ అందేలా టీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. ముందు గా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎ స్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన జడల అమరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌కుమార్, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.
భూదానపోచంపల్లి: వరంగల్‌లో నవంబరు 15న నిర్వహించే టీఆర్‌ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు సీత వెంకటేశం అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్‌చైర్మన బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు మల్లారెడ్డి, మధు, చక్రపాణి, అఖిలబలరాం, కుమార్, నాయకులు మల్లేశంగౌడ్, చంద్రంయాదవ్, యాదగిరి, బాలచంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం: మండలకేంద్రంలోని మాతృశ్రీ గ్రా మర్ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొలగౌని వెంకటే్‌షగౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జ రిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ స భకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పీ ఏసీఎస్ చైర్మన గూదె బాల నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు మన్నె శ్రీధర్, నాయకులు ధీరావత పాశ్యనాయక్, నరేందర్‌రెడ్డి, బట్కీరు బీరప్ప, బాల్‌సింగ్ నాయక్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.