రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-11-02T06:17:22+05:30 IST

రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎ మ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు.

రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్సీ

భువనగిరిరూరల్‌, నవంబరు 1: రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎ మ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. ఎంపీపీ నరాల ని ర్మల అధ్యక్షతన సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. కోరం సభ్యులు సకాలంలో హాజరుకాకపోవడంతో గంట ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సీ డీపీ నిధులతో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి తాను నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆ నిర్మాణా లు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయని వెంటనే పూర్తి చే యాలన్నారు. వడపర్తి సర్పంచ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్‌ మాట్లాడుతూ మూడేళ్ల నుంచి కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడం తో ఒంటరి, వితంతు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పలు సమస్యలపై చర్చించారు. సమావేశంలో జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, ఏఎం సీ చైర్మన నల్లమాస రమేశ, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, త హసీల్దార్‌ శ్యాంసుందర్‌, వైస్‌ ఎంపీపీ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-02T06:17:22+05:30 IST