ప్రతీకార హత్య కేసులో నిందితుల అరెస్టు, రిమాండ్‌

ABN , First Publish Date - 2021-08-20T06:12:48+05:30 IST

నల్లగొండ పట్టణంలోని అక్కలాయిగూడెంలో ప్రతీకార హత్యలో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రతీకార హత్య కేసులో నిందితుల అరెస్టు, రిమాండ్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

 వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నల్లగొండ క్రైం, ఆగస్టు 19 :
నల్లగొండ పట్టణంలోని అక్కలాయిగూడెంలో ప్రతీకార హత్యలో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక వనటౌన పోలీస్‌స్టేషనలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. అక్కలాయిగూడెం(గంధంవారిగూడెం) గ్రా మానికి చెందిన ఆవుల రామస్వామి(57) ఆయన అన్న కాశయ్యకు మధ్య భూతగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలం వద్దకు వెళ్లిన రామస్వా మిపై అన్న కాశయ్య కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు. మృతు డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశామ న్నారు. ఈ హత్యకు ప్రతీకారంగా ఈ నెల 8వ తేదీ రాత్రి ఆవుల కాశయ్య ను సైతం రామస్వామి కుమారుడు కిరణ్‌తో పాటు అతని బంధువులు కర్రలతో కొట్టి హత్య చేసి పరారాయ్యరు. ఈ కేసులో ఆవుల మహేష్‌, ఆవుల మల్లేశ, ఆవుల కాశయ్య, ఆవుల రత్నమ్మను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు పరిశోధనలో కీలకంగా పనిచేసిన వనటౌన సీఐ బాలగోపాల్‌తో పాటు అధికారులను సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సీఐ బాలగోపాల్‌, ఎస్‌ఐ నరేష్‌, పీఎ్‌సఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-08-20T06:12:48+05:30 IST