హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

ABN , First Publish Date - 2021-05-20T06:48:41+05:30 IST

హత్య చేస్తాడన్న భయంతో చంపేశారు. ఓ హ త్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన వ్యక్తి తమను చంపుతానని బెదిరి స్తున్నందున ఆ భయంతో అతడిని హత్య చేశారు.

హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

బెదిరిస్తున్నాడనే భయంతో చంపేశారు

పాత కక్షలే కారణం 

పహిల్వాన్‌పూర్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

యాదాద్రి, మే19 (ఆంధ్రజ్యోతి): హత్య చేస్తాడన్న భయంతో చంపేశారు. ఓ హ త్య కేసులో జైలుకు వెళ్లి  బెయిల్‌పై బయటికి వచ్చిన వ్యక్తి తమను చంపుతానని బెదిరి స్తున్నందున ఆ భయంతో అతడిని హత్య చేశారు. ఈనెల 17న జరిగిన వలిగొండ మం డ లం పహిల్వాన్‌పూర్‌ గ్రామ పరిధిలోని చిట్టపోనిబావికి చెందిన ఎలిమినేటి లక్ష్మారెడ్డి కుమారుడు వెంకటరెడ్డి(41) హత్య కేసును రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు ఛేదిం చా రు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరించా రు.   భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండ లం  పహిల్వాన్‌పురం గ్రామ పరిధిలోని  చిట్టబోయిన బావి వద్ద అదే గ్రామానికి  లక్ష్మా రెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి సమీప బంధువు ఎలిమినేటి సంజీవరెడ్డి మధ్య గట్ల పంచాయతీలు, భూతగాలు ఉన్నాయి.  దీంతో గత ఏడాది జూన్‌లో సంజీవరెడ్డిని వెంకట్‌రెడ్డి హత్య చేశాడు. పోలీసులు వెంకట్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకటరెడ్డి ఇంటిని కొందరు పాలెవాళ్లు ధ్వంసం చేశారు. నెల రోజలు క్రితం బెయిల్‌పై వచ్చిన వెంకటరెడ్డి తన ఇంటిని ధ్వంసం చేసిన వారిని కూడా చంపి మళ్లీ జైలుకు పోతానని బెదరిస్తున్నాడు.  

పథకం ప్రకారం..

 దీంతో లక్ష్మారెడ్డి కుమారుడైన వెంకట్‌రెడ్డిని మనమే ముందుగా చంపుదామని బం ధువైన ఎలిమినేటి యాదారెడ్డి కుమారుడైన వెంకట్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు ఎలిమినేటి జలంధర్‌రెడ్డి, ఆత్మకూర్‌(ఎం)కు చెందిన తమ్ముడి కుమారులు ఎలిమినేటి నిరంజన్‌రెడ్డి,  ఉదయ్‌కిరణ్‌రెడ్డి, పులిగిల్లకు చెందిన అల్లుడు జక్క దామోదర్‌ రెడ్డితో కలిసి పథకం వేశారు. తమను బెదిరిస్తున్న వెంకటరెడ్డి గ్రామశివారులోని ఉన్నా డని తెలుసుకున్న నిందితుడు ఎలిమినేటి వెంకట్‌రెడ్డి తన కుమారుడు, తమ్ముడి కుమా రులకు, అల్లుడికి సమాచారం అందించాడు. ఈ ఐదుగురూ బైకులపై ఘటనా స్థలానికి   చేరుకుని  గొడ్డలితో దాడి చేసి వెంకట్‌రెడ్డిని హత్య చేశారు. .  మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హత్యకు పాల్పడిన ఐదుగురినీ పులిగిల్ల చౌరస్తా వద్ద  బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, మోటర్‌సైకిల్‌, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. రెండు రోజలు వ్యవధిలోనే హత్య కేసును ఛేదించిన చౌటుప్పల్‌ ఎసీపీ పి.సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ను డీసీపీ కె.నారాయణరెడ్డి అభినందించారు.  

Updated Date - 2021-05-20T06:48:41+05:30 IST