భక్తి శ్రద్ధలతో దత్తజయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-12-19T05:37:45+05:30 IST

దత్త జయంతి వేడుకలను శనివా రం భువనగిరిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో దత్తజయంతి వేడుకలు
భువనగిరి దత్త జయంతి వేడుకల్లో పూజలు చేస్తున్న తీన్మార్‌ మల్లన్న

భువనగిరిటౌన, డిసెంబరు 18: దత్త జయంతి వేడుకలను శనివా రం భువనగిరిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని ఓంకార్‌ నగర్‌లోని శ్రీదత్త ప్రసన్న నిలయంలో అభిషేక, హోమ పూజలు చేశారు. హరేరామ హరేకృష్ణ సంస్థ సభ్యుల భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. విఠల్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో మునిసిపల్‌ చెర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చెర్మన చింతల కిష్టయ్య, బీజేపీ రాష్ట్ర నాయకుడు, క్యూ న్యూస్‌ అధినేత తీన్మార్‌ మల్లన్న, కౌన్సిలర్‌ జన గాం కవిత నర్సింహచారి, నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్‌, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, రమేష్‌, శివశంకర్‌, కపిల్‌ పాల్గొన్నారు. శ్రీరాగ పూజిత సాయి సంస్థాన, అయ్యప్పస్వామి ఆలయాల్లో దత్త జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. కార్యక్రమంలో బండారు శ్రీనివా్‌సరావు పాల్గొన్నారు. 

బొమ్మలరామారం: లోక కల్యాణార్థం 108 యజ్ఞ మండపాలతో సు మారు 300 జంటలతో యాగాన్ని నిర్వహించినట్లు సాయిదామం పీఠాధిపతులు శ్రీ రమానంద ప్రభూజీ తెలిపారు. మండలంలోని పెద్దపర్వతాపూర్‌ గ్రామ శివారులో గల శ్రీసాయి సేవా ఆశ్రమం సాయిధామంలో శ నివారం దత్తజయంతిని పురస్కరించుకొని చతుర్థఅష్టోత్తర కుందాత్మక ఏ కవహ్నిక శ్రీ దత్తశక్తి మహాయాగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 108 యజ్ఞ గుండాలతో సుమారు 300 మంది జంటలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మల యోగభారతి మాట్లాడుతూ దేశ విశిష్టత ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం సా యి ధామం నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ యాగాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-19T05:37:45+05:30 IST