దళితుల భూములను కాపాడాలి

ABN , First Publish Date - 2021-10-21T06:18:39+05:30 IST

తమ భూములను కాపా డాలని మండలంలోని వస్తాకొండూరు గ్రామంలో పలువురు దళితులు కోరారు. తమకు ప్రభుత్వం కేటా యించిన భూమిని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు కబ్జా చేశారని తెలిపారు.

దళితుల భూములను కాపాడాలి
గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో ఆందోళన చేస్తున్న దళితులు

గుండాల, అక్టోబరు 20: తమ భూములను కాపా డాలని మండలంలోని వస్తాకొండూరు గ్రామంలో  పలువురు దళితులు కోరారు. తమకు ప్రభుత్వం కేటా యించిన భూమిని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు కబ్జా చేశారని తెలిపారు.  ఈ మేరకు వస్తాకొం డూరు గ్రామంలో దళితులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సర్వే నెం.1లో ఎ10–01 గుంట భూమి ఉండగా సీలిం గ్‌లో ఎ7–28గుంటల భూమి పోయిందన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి ఎ2–11గుంటల భూమిని దళిత వాడకు 1996 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించిం దన్నారు. ఈ భూమిని కొంత మంది రియల్టర్లు గ్రామంలోని రాజకీయ నాయకుల అండదండలతో భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్‌ వేశారన్నారు. ఉన్నతాధికారుల స్పందిం చి తమ భూమిని తమకు ఇప్పించాలన్నారు. ఈ భూమిలో శివాలయం ఉండగా, గుప్త నిధుల కోసం గుడిని పూర్తిగా ధ్వంసం చేశారని, అడ్డుకుం టున్న వారిని రియల్టర్లు బెదిరి స్తున్నారన్నారు. ఈ విష యంపై రెవెన్యూ, పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సర్వే చేయించి  భూమి తమకు స్వాధీనపర్చాలని,   శివాల యంలో గుప్త నిధుల తవ్వకాలను నిలిపివే యిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, నరేష్‌, దర్గ య్య, సోమయ్య, నర్సయ్య, యాదగిరి పాల్గొన్నారు.Updated Date - 2021-10-21T06:18:39+05:30 IST