‘దళిత బంధు’ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి: ఆర్డీఆర్‌

ABN , First Publish Date - 2021-09-03T06:55:15+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ‘దళిత బంధు’ అమలు చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ‘దళితగిరిజన ఆత్మగౌరవ యాత్ర’లో భాగంగా మండలంలోని బండమీది చందుపట్ల దళితవాడలో గురువారం పర్యటించారు. డోలు కొట్టి, సమర శంఖం పూరించి మాట్లాడారు.

‘దళిత బంధు’  రాష్ట్ర వ్యాప్తంగా  అమలు చేయాలి: ఆర్డీఆర్‌
బండమీది చందుపట్లలో డోలు కొట్టి సమర శంఖం పూరిస్తున్న ఆర్డీఆర్‌

చివ్వెంల, సెప్టెంబరు 2: రాష్ట్ర వ్యాప్తంగా ‘దళిత బంధు’ అమలు చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ‘దళితగిరిజన ఆత్మగౌరవ యాత్ర’లో భాగంగా మండలంలోని బండమీది చందుపట్ల దళితవాడలో గురువారం పర్యటించారు. డోలు కొట్టి, సమర శంఖం పూరించి మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఒక పథకం తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకుంటున్నారన్నారు.  ఎన్నికల్లో ఓట్ల కోసం, కుటుంబ పాలన కోసం ప్రభుత్వ సొమ్మును సీఎం కేసీఆర్‌ వినియోగిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు తిరుమళ ప్రగడ అనురాద కిషన్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న ,  రాజేశ్వర్‌రావు, వాసుదేవరావు, రమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T06:55:15+05:30 IST