తీగలకు తగులుతోందని నరికేశారు..

ABN , First Publish Date - 2021-06-21T05:50:46+05:30 IST

అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఏపుగా ఎదుగుతున్న హరితహారం చెట్లను నరికివేయాల్సి వస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి-రాయిగిరి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా రెండేళ్ల క్రితం మొక్కలు నాటారు.

తీగలకు తగులుతోందని నరికేశారు..

యాదాద్రి : అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఏపుగా ఎదుగుతున్న హరితహారం చెట్లను నరికివేయాల్సి వస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి-రాయిగిరి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా రెండేళ్ల క్రితం మొక్కలు నాటారు. అధికారులు అనాలోచితంగా వీటిని విద్యుత్‌ తీగల కింద నాటారు. అవి ప్రస్తుతం ఏపుగా పెరుగుతున్నాయి. కాగా, ఆ మొక్కలు విద్యుత్‌ తీగలకు తాకుతుండడంతో ట్రాన్స్‌కో అధికారులు కొన్ని చెట్లను పూర్తిగా నరికివేశారు. ఇది చూసిన పర్యావరణ ప్రియులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-06-21T05:50:46+05:30 IST