రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే సహించేదిలేదు : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-08-27T05:35:30+05:30 IST

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి దిగజారుడు విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నాయకులు చూస్తూ ఊరుకోరని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ హెచ్చరించారు.

రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే సహించేదిలేదు : కాంగ్రెస్‌
సూర్యాపేటలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సూర్యాపేటటౌన్‌/ హుజూర్‌నగర్‌/ నూతన్‌కల్‌/ మునగాల, ఆగస్టు 26 : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి దిగజారుడు విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నాయకులు చూస్తూ ఊరుకోరని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేసి మాట్లాడారు. మంత్రి పదవిలో ఉండి తాగుబోతులా మాట్లాడడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శణమన్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, బైరు శైలేందర్‌గౌడ్‌, అంజద్‌అలీ, పోలగాని బాలుగౌడ్‌, వెం కన్నయాదవ్‌, నాగుల వాసు, జానయ్య, లింగస్వామి, శేఖర్‌, ఆలేటి మాణిక్యం, వల్ధాస్‌ శ్రీను, మంజుల, సువర్ణ, నరేందర్‌నాయుడు, నవీన్‌కుమార్‌, సైదులు, నాగరాజు, అశోక్‌ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కుక్కడపు మహేష్‌, కిరణ్‌, ఉపేందర్‌, దిల్‌,  లక్ష్మణ్‌, లోకేష్‌, వీరబాబు, ప్రవీణ్‌, నరేందర్‌, సతీష్‌ పాల్గొన్నారు. నూతన్‌ కల్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి పదవిలో ఉండి నోటికొ చ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో నాయకులు దరిపెల్లి వీరన్న, రామచంద్రయ్య, అయోధ్య, అశోక్‌, కృష్ణ, సైదులు ఉన్నారు. మునగాల మండలంలోని నర్సింహాపురంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జాయింట్‌ సెక్రటరీ వేమూరి సత్యనారాయణ మాట్లాడారు. అవినీతి అక్రమాలు, భూకబ్జా ఆరోపణలు వస్తే వాటిని చట్టానికి లోబడి న్యాయపరంగా ఎదుర్కొని సచ్ఛీలుడిగా నిరూపించుకోవాలన్నారు. 

Updated Date - 2021-08-27T05:35:30+05:30 IST