కౌన్సిల్ సమావేశాలు జీడిపప్పుతో సరి
ABN , First Publish Date - 2021-12-30T06:33:05+05:30 IST
మునిసిపల్ కౌన్సిల్ సమావేశా ల్లో జీడిపప్పు ఇచ్చి పంపుతున్నారే తప్ప క నీసం రోజువారీ పనులు కూడా చేయడం లేదని మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల ల క్ష్మారెడ్డి అన్నారు.

మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆగ్రహం
మిర్యాలగూడ, డి సెంబరు 29: మునిసిపల్ కౌన్సిల్ సమావేశా ల్లో జీడిపప్పు ఇచ్చి పంపుతున్నారే తప్ప క నీసం రోజువారీ పనులు కూడా చేయడం లేదని మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల ల క్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మునిపిపల్ చై ర్మన అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎల్‌ఆర్ మాట్లాడుతూ రెండేళ్ల నుంచి జరిగిన 6 కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తిన సమస్యలపై అధికారులు కుంటిసాకులు చెబుతున్నారే తప్ప పరిష్కరించడం లే దని ఆరోపించారు. 48 వార్డుల్లో అభివృద్ధి పనులకు సమానంగా నిధులు మంజూరు చేయాలన్నారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ వార్డులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్‌రెడ్డి, రుణాల్‌రెడ్డి, జాని, అనిత, రామకృష్ణ పాల్గొన్నారు.