కరోనా నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-02T05:50:08+05:30 IST

ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటా చలం అన్నారు.

కరోనా నిబంధనలు పాటించాలి
హుజూర్‌నగర్‌లో శానిటైజర్‌ పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 1: ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటా చలం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్‌-1 నూతన డైరీలను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వై. వెంకటేశ్వర్లు, మాండ్రన్‌ సుదర్శన్‌, హర్షవర్థన్‌, కళ్యాణ చక్రవర్తి, సాహితి, చంద్రశేఖర్‌, భాస్కర్‌రాజు, విజయ, నరేందర్‌రెడ్డి, శేషయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

హుజూర్‌నగర్‌ రూరల్‌: హుజూర్‌నగర్‌లోని ఇందిర సెంటర్‌లో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ర,్ట కార్యదర్శి నలమాద శ్రీనివాస్‌యాదవ్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా సహదేవరావు మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజలందరు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో తండు సాయిరామ్‌గౌడ్‌, సైదా, శ్రీనివాస్‌, అంజి, రాములు, ఉపేందర్‌, సోమయ్య, లింగయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T05:50:08+05:30 IST