కబ్జాకు అధికార నాయకుల కుట్ర: టీడీపీ
ABN , First Publish Date - 2021-01-13T05:22:28+05:30 IST
గుర్రంబోడుతండాలోని 540 సర్వే నెంబరులోని రూ.వందల కోట్ల విలువైన భూములను కొంతమంది అధికార పార్టీ నేతలు కాజేయాలనే ఉద్దేశంతో కబ్జాదారులకు సహకరిస్తున్నారని టీటీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ప్రొఫెసర్ జ్యోత్స్య అన్నారు.

మఠంపల్లి, జనవరి 12 : గుర్రంబోడుతండాలోని 540 సర్వే నెంబరులోని రూ.వందల కోట్ల విలువైన భూములను కొంతమంది అధికార పార్టీ నేతలు కాజేయాలనే ఉద్దేశంతో కబ్జాదారులకు సహకరిస్తున్నారని టీటీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ప్రొఫెసర్ జ్యోత్స్య అన్నారు. మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూలోని సర్వే నెంబరు 540లోని భూములను జిల్లా నాయకులతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడారు. గిరిజన రైతుల గోస ఎమ్మెల్యే, ఎంపీలకు వినిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఆర్డీవో, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే పేద గిరిజనుల భూములను కబ్జాదారులు లాక్కుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో కాట్రగడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న, నల్లగొండ పార్లమెంటు అధ్యక్షుడు నెల్లూరు దుర్గాప్రసాద్, చావా సహదేవరావు, వినయ్‌నాయక్, ఓరుగంటి ప్రభాకర్, నంబూరి సూర్యం, నాగేంద్రరాధిక, టీడీపీ మండల అధ్యక్షుడు మాలోతు నాగునాయక్, మండల వెంకటేశ్వర్లుగౌడ్, తండు సాయిరాంగౌడ్, వీరన్ననాయక్, మోత్యినాయక్, నరసింహా, సైదా, సుశీల, స్వామి పాల్గొన్నారు.
మేళ్లచెర్వు: పరిశ్రమల ఆధీనంలోని భూదాన భూముల బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయనతో పాటు టీడీపీ బృందం బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్య, నాయకులు నారాయణ, జానకిరాములు, మాన్యనాయక్, రాములు యాదవ్, రాధిక, నాగరాజు, వెంకటయ్య, గోవిందు పాల్గొన్నారు.