అసత్య ఆరోపణలు మానుకోవాలి : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-12-31T16:07:17+05:30 IST

హుజూర్‌నగర్‌లోని పలు వార్డులను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే సైదిరెడ్డి గొప్పలు చెప్పుకోవడం శోచనీయమని కాంగ్రెస్‌ నాయ కులు విమర్శించారు.

అసత్య ఆరోపణలు మానుకోవాలి : కాంగ్రెస్‌

హుజూర్‌నగర్‌ , డిసెంబరు 30: హుజూర్‌నగర్‌లోని పలు వార్డులను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే సైదిరెడ్డి గొప్పలు చెప్పుకోవడం శోచనీయమని కాంగ్రెస్‌ నాయ కులు విమర్శించారు. పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్‌ నాయకులు గురువారం పర్యటించారు. అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 2018లో డీఎంఎఫ్‌టీ నిధులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, రైల్వే యూ జర్‌ కమిటీ సభ్యులు యరగానినాగన్న, కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి, జక్కుల మల్లయ్య, యండీ అజీజ్‌పాషా, వీరారెడ్డి, రామ్మూర్తి, రామరాజు, చంద్రశేఖర్‌, సత్యనారాయణ, అంజయ్య, నాగేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:07:17+05:30 IST