సర్పంచ్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-31T15:57:55+05:30 IST

ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్‌, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ..

సర్పంచ్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు

సంస్థాన్‌ నారాయణపురం, డిసెంబరు 30: ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్‌, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన   ప్రజలు ఎంపీడీవో యాదగిరికి గురువారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని లచ్చమ్మగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకానికి సంబందించిన వాచర్‌లను చెట్లకు నీళ్లు పోసేందుకు, వాటి సంరక్షణ పనులకే ఉపయోగించాల్సి ఉండగా,  దానికి విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ భర్త, కుమారుడు వారితో కాంట్రాక్ట్‌ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవిషయంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి అందజేసిన వారిలో జక్కలి విక్రమ్‌, యాదయ్య, లింగయ్య, కుమార్‌, లింగయ్య ఉన్నారు.

Updated Date - 2021-12-31T15:57:55+05:30 IST