దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-19T06:22:30+05:30 IST

కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి గాయపర్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన పాతూరి వెంకటేశ్వర్‌రావు వనటౌన పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.

దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు

మిర్యాలగూడ అర్బన, అక్టోబరు 18 : కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి గాయపర్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన పాతూరి వెంకటేశ్వర్‌రావు వనటౌన పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ముత్యాలమ్మ గుడి పండుగ ఉత్సవాల్లో పాల్గొని ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా కర్ర కోటేశ్వర్‌రావు, బిక్కి శ్రీనివాస్‌, పిన్నబోయిన శ్రీనివా్‌సతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు కర్రలతో దాడిచేసి హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. తలకు బలమైన గాయం కావడంతో కేకలు పెట్టగా స్థానికులు అక్కడకు చేరడంతో నిందితులు ప రారైనట్లు చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-10-19T06:22:30+05:30 IST