విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-12-19T05:31:40+05:30 IST

ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని పీడీఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి
సూర్యాపేటలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థిసంఘం నాయకులు

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 18 : ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని పీడీఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ నుంచి 60 ఫీట్ల రోడ్డు వరకు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు, గ్రామీణ పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేక అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని; కార్పొరేట్‌ కళాశాలలకు ఫీజుల కోసమే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు మచ్చ గోపి, స్నేహా, శిరీష, మౌనిక, కావ్య, నవీన్‌, మురళీ, వినయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:31:40+05:30 IST