కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు వెంకటేశ్వర్లు మృతి

ABN , First Publish Date - 2021-06-21T05:50:33+05:30 IST

కమ్యూనిస్టు సీనియర్‌ నాయకులు, నెమ్మికల్‌ మాజీ సర్పంచ్‌ గుంటి వెంకటేశ్వర్లు(68) శనివారం రాత్రి మృతి చెందారు.

కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు వెంకటేశ్వర్లు మృతి
గుంటి వెంకటేశ్వరు(ఫైల్‌)

ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 20 : కమ్యూనిస్టు సీనియర్‌ నాయకులు, నెమ్మికల్‌ మాజీ సర్పంచ్‌ గుంటి వెంకటేశ్వర్లు(68) శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల కరోనా వచ్చి తగ్గినప్పటికీ శ్వాసకు సంబంధిత సమస్యతో బాధపడుతూ సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెమ్మికల్‌ గ్రామానికి 1983 నుంచి 1998 వరకు సీపీఎం   నుంచి గెలిచి సర్పంచ్‌గా పని చేశారు. సీపీఎం సీనియర్‌ నేత బీఎన్‌రెడ్డికి అనుచరుడుగా, ఓ పత్రికలో జర్నలిస్టుగా సేవలందించారు. ఇటీ వల సీపీఐలో చేరి మండల కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆయన మృతికి సీపీఎం నాయకులు దండ వెంకట్‌రెడ్డి, వేల్పుల వెంకన్న, సర్పంచ్‌ గంపల దావీద్‌, ఎంపీటీసీ ముత్తయ్య, అంతయ్య, యల్లయ్య, చక్ర య్య, లక్ష్మారెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. 

Updated Date - 2021-06-21T05:50:33+05:30 IST