పోడు సమస్యను మరిచిన సీఎం

ABN , First Publish Date - 2021-12-31T06:20:07+05:30 IST

పోడు భూముల సమస్యను పరిష్కారిస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటమార్చారని, గత పర్యటనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికీ అమలు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

పోడు సమస్యను మరిచిన సీఎం
సమావేశంలో మాట్లాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ముగిసిన బీజేపీ శిక్షణా తరగతులు

సూర్యాపేటరూరల్‌, డిసెంబరు 30: పోడు భూముల సమస్యను పరిష్కారిస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటమార్చారని, గత పర్యటనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికీ అమలు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని పీజీఎఫ్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతుల ముగింపులో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్ర పర్యటనలో నిజా లు ఒప్పుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలన్నారు. రాష్ట్రంలో కేవలం సిద్దిపేట, గజ్వేల్‌ మాత్రమే అభివృద్ధి పథంలో ఉన్నాయని ఒప్పుకున్నారన్నారు. గుర్రంబోడు తండా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన సీఎం ఆ మాట మరిచారన్నారు. రాష్ట్రం లో కమీషన్ల కోసమే పనులు కొనసాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఉత్తర్వులు ఇప్పించింది తామేనని, ఢిల్లీకి వెళ్లిన మంత్రులు చేసింది శూన్యమన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రితో బీజేపీ నేతల బృందం మాట్లా డి 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించామన్నారు. బీజేపీలోకి వచ్చేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారని, జనవరి తర్వాత ఒక శుభవార్త ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ఆర్‌ఆర్‌ఆర్‌లకు మరో ఆర్‌ఆర్‌ఆర్‌ కలవనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొమరంభీం వారసులుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గాలకు నిధులు రాకుంటే కేబినెట్‌ మంత్రులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 117 అసెంబ్లీ స్థానాలకు పక్షపాతం లేకుండా సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, కడియం రామచంద్రయ్య, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, చలమల్ల నర్సింహ, మీర్‌అక్బర్‌, పల్స మల్సూర్‌గౌడ్‌, వల్దాసు ఉపేందర్‌, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, వెన్న శశిధర్‌రెడ్డి, సలిగంటి నాగరాజు, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:20:07+05:30 IST