నల్లగొండలో నాలుగు గంటలు పాటు సీఎం పర్యటన సాగిందిలా...
ABN , First Publish Date - 2021-12-30T16:49:01+05:30 IST
ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి మారయ్య చి త్రపటానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.

నల్లగొండ/నల్లగొండ క్రైం/నల్లగొండ టౌన్, డిసెంబరు 29: ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి మారయ్య చి త్రపటానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో హెలికాఫ్టర్ దిగిన కేసీఆర్ ప్రత్యేక బస్సు లో ఎమ్మెల్యే కిషోర్ నివాసానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని అదే బస్సులో కలెక్టరేట్‌కు చేరుకొని అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన సుమారు 4 గంటలు కొనసాగింది.
1:27 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల
మైదానంలో హెలికాఫ్టర్ దిగిన కేసీఆర్
ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా 1:39 గంటలకు
ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసానికి చేరిక
1:45కు ఎమ్మెల్యే కిషోర్ తండ్రి గాదరి మారయ్య
చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించిన కేసీఆర్
1:50 నిమిషాలకు కిషోర్ కుటుంబ సభ్యులకు పరామర్శ
2:00గంటలకు మధ్యాహ్న భోజనం చేసిన సీఎం కేసీఆర్
2:45 గంటలకు కిషోర్ నివాసం నుంచి
కలెక్టరేట్‌కు బయల్దేరిన కేసీఆర్
3 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష
4:15 గంటలకు సమీక్షా సమావేశం ముగింపు
4:20 గంటలకు కలెక్టరేట్ నుంచి బయల్దేరిన సీఎం
4:25 గంటలకు ఆర్‌అండ్‌బీకి చేరుకున్న కేసీఆర్ కాన్వాయ్
4:30గంటలకు ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్
4:45 గంటలకు ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకొని
హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆ ర్, వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి, ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, అభిమన్యు శ్రీని వాస్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం


