పరిహారం అందిస్తేనే పనులకు సహకరిస్తాం

ABN , First Publish Date - 2021-12-31T16:35:51+05:30 IST

సమస్యలు పరిష్కరిస్తే ప్రాజె క్టు పనులకు సహకరిస్తామని చర్లగూడెం రిజర్వాయర్‌ నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు అన్నారు.

పరిహారం అందిస్తేనే పనులకు సహకరిస్తాం

మర్రిగూడ, డిసెంబరు 30: సమస్యలు పరిష్కరిస్తే ప్రాజె క్టు పనులకు సహకరిస్తామని చర్లగూడెం రిజర్వాయర్‌ నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు అన్నారు. రిజర్వాయర్‌ వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం అందించాలని నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు చేపట్టిన ధర్నా 51వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు, ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్య పరిష్కరిస్తే ఆందోళనను విరమిస్తామని అన్నారు. లేకుంటే ప్రాజెక్టు పనులు కొనసాగనిచ్చే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ధర్నాలో నిర్వాసితులు రా ములు, చంద్రయ్య, యేసోబు, వెంకటయ్య, శేఖర్‌, ఉపేందర్‌, భారతమ్మ, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:35:51+05:30 IST