చందుపట్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-27T06:44:40+05:30 IST

భువనగిరి మండలం చందుపట్ల గ్రామ పంచా యతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు వచ్చిన అభియోగంపై పంచాయతీ కార్యదర్శి విజయశాంతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

చందుపట్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

 సర్పంచ్‌కు షోకాజు నోటీసులు జారీ 

 భువనగిరి రూరల్‌, ఆగస్టు 26: భువనగిరి మండలం చందుపట్ల గ్రామ పంచా యతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు వచ్చిన అభియోగంపై పంచాయతీ కార్యదర్శి విజయశాంతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా నిధుల అవకతవకలపై వచ్చిన ఫిర్యాదు మేరకు  ఇటీవల అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ  నివేదిక ఇచ్చారాన్నరు. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ పమేలా సత్పథి అదేశాల మేరకు గ్రామ సర్పంచ్‌ చిన్నం పాండుకు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా షోకాజు నోటీసులు జారీ చేశారని ఎంపీడీవో టి.నాగిరెడ్డి  తెలిపారు. అయితే నోటీసులు జారీ చేసిన వారం రోజుల్లోగా సర్పంచ్‌ వివరణ ఇవ్వాలని డీపీవో ఆదేశించారన్నారు.  


Updated Date - 2021-08-27T06:44:40+05:30 IST