రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి : శ్రీధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-21T06:01:14+05:30 IST

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి : శ్రీధర్‌రెడ్డి
రైతులకు ఉచితంగా కంది, పెసర్ల విత్తనాలు పంపిణీ చేస్తున్న శ్రీధర్‌రెడ్డి

దేవరకొండ, జూన 20 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ స్కీం పథకం కింద కేం ద్రం ఉచితంగా అందిస్తున్న కందులు, పెసర్ల విత్తనాలను పట్టణంలో రైతులకు ఆదివారం ఆయన పంపిణిచేసి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి  పెద్దపీట వేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్‌, గుండాల అంజయ్యయాదవ్‌, అంకూరి నర్సింహ, గాజుల మురళి, వస్కుల సుధాకర్‌, సముద్రాల సహదేవ్‌, జల్లా భాస్కర్‌, చండీశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:01:14+05:30 IST