ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం : జూలకంటిప్రజాసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం : జూలకంటి

ABN , First Publish Date - 2021-08-27T06:08:50+05:30 IST

ప్రజల సంపద ను కార్పొరేట్‌ సంస్థలకు కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం దోచి పెడుతోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్మి మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు.

ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం : జూలకంటిప్రజాసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం : జూలకంటి
హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

హుజూర్‌నగర్‌ రూరల్‌, ఆగస్టు 26: ప్రజల సంపద ను కార్పొరేట్‌ సంస్థలకు కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం దోచి పెడుతోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్మి మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను హోల్‌సేల్‌గా ఆదాని, అంబాని కుటుంబాలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఎన్నికలో గెలుపుకోసం ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు. డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు మాటలకే పరిమితమైందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, మోదీ అలయ్‌బలయ్‌గా ఉన్నారని ఆరోపించారు. నల్లధనం తెస్తానన్న మోదీ మాటలకే పరిమితమయ్యారన్నారు. కరోనా కట్టడిలో పాలకులు విఫలమయ్యారన్నారు. సమావేశంలో నాగారపు పాండు, ముల్కలపల్లి సీతయ్య, సైదులు, పల్లె వెంకటరెడ్డి, వీరమల్లు, మురళి, వీరస్వామి, యోనా, హుస్సేన్‌, బ్రహ్మం, జేవీ, పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T06:08:50+05:30 IST