భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-26T05:59:13+05:30 IST

క్రిస్మస్‌ వేడుకలు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్‌ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. భువనగిరిలోని మన్నా చర్చిలో ఫాదర్‌ జార్జ్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. మునిసి

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ వేడుకలు
యాదగిరిపల్లి చర్చిలో కేక్‌కట్‌ చేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

భునవగిరి రూరల్‌, డిసెంబరు 25: క్రిస్మస్‌ వేడుకలు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్‌ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. భువనగిరిలోని మన్నా చర్చిలో ఫాదర్‌ జార్జ్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆంజనే యులు, సీహెచ్‌ కిష్టయ్య కేక్‌ కట్‌ చేశారు. బిలివర్‌ చర్చిలో పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, బీసుకుంట్ల సత్యనారాయణ, బర్రె జహంగీర్‌, బట్టు రామచం ద్రయ్య, కోళ్ల గంగాధర్‌, పడిగెల ప్రదీప్‌, పోతంశెట్టి మంజుల, కవిత పాల్గొన్నారు.  

భూదాన్‌పోచంపల్లి: పట్టణంలోని బాప్టిస్టు, గిల్గాలు చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. అగ్ని ప్రవేశంతో పాటు చర్చిల్లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్‌కట్‌ చేసి భక్తిగీతాలు ఆలపించారు. పేద లకు దస్తులు పంపిణీ చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మాల్లో పాస్టర్లు జాకప్‌రాజ్‌, తిమోతి, ఇజ్రాయిల్‌, డానియల్‌, కవిత, సరిత, అనిల్‌, సోను, జాన్‌, పాండు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. 

యాదాద్రి రూరల్‌: మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని యాదగిరిపల్లి చర్చిలో కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో గుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్‌, మిట్ట వెంకటయ్యగౌడ్‌, గడ్డం చంద్రయ్య, శిఖ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

ఆలేరు: తోటివారిపట్ల ప్రేమ చాటడం ద్వారానే శాంతి సమాజ  స్థాపన సాధ్యమవుతుందని డాక్టర్‌ ప్రభాకర్‌, ఆలేరు మాజీ సర్పంచ్‌ ఆకవరం మోహన్‌రావు అన్నారు. ఆలేరులోని ప్రేమ సేవా సదనంలో క్రిస్మస్‌ వేడు కలు నిర్వహించారు. కార్యక్రమంలో కోరికొప్పుల మల్లేష్‌, డ్యానియల్‌, వెంక టేష్‌, సంపత్‌, ఫౌల్‌, ఉన్నారు. టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

ఆలేరు రూరల్‌: మండలంలోని పలు చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిం చారు. కార్యక్రమాల్లో కంతిదాస్‌, ఫౌల్‌, ప్రకాశ్‌, ఇస్మానియల్‌, పిలిప్స్‌, కరు ణాకర్‌, బాలస్వామి, జోసెఫ్‌ తదితరులు ఉన్నారు. 

ఆత్మకూరు(ఎం): మండలకేంద్రం తోపాటు గ్రామాల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలకేంద్రంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు యాసలక్ష్మారెడ్డి, బీసు చందర్‌, సర్పంచ్‌ నగేష్‌, ఎంపీటీసీ కవిత తదితరులు పాల్గొన్నారు. 

వలిగొండ: వలిగొండ, నర్సయ్యగూడెం, వెల్వర్తి, కమ్మగూడెం, పులిగిల్ల గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శౌరి, ఇన్నయ్య, ఆరోగ్యయ్య, విజయ్‌, చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు. 

మోత్కూరు: మండలకేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగారిగారి ప్రీతం క్రిస్మస్‌ కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ జి. లక్ష్మీనర్సింహారెడ్డి, పైళ్ల సోమిరెడ్డి, గుండగోని రామచంద్రు, ఎండి.అయాజ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, కారుపోతుల వెంకన్న, మెంట సురేష్‌ పాల్గొన్నారు. 

మోటకొండూర్‌: మండల వ్యాప్తంగా అన్ని చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని చందేపల్లిలోని బేటేల్‌ బాప్టిస్‌ చర్చిలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫాస్టర్లు రేవ సుధాకర్‌ రావు, ఎస్‌ఐ నాగరాజు, రాజుకుమార్‌, సలోమిన్‌, ఆదాం, అంశయ్య తదితరులు పాల్గొన్నారు. 

సంస్థాన్‌ నారాయణపురం: క్రిస్‌మస్‌ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

రాజాపేట: మండలంలోని పాముకుంట, రాజాపేట, బొందుగుల సోమారం రఘునాధపురం, సింగారం, బేగంపేట గ్రామాల్లో క్రిస్మస్‌ వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు భక్తిగీతాల గేయాలాపన చేశారు. 

రామన్నపేట: మండలంలోని రామన్నపేట, ఎన్నారం తదితర గ్రామాల్లో క్రిస్‌మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో కోళ్ళ శ్రీనివాస్‌, అబ్రహంకుమార్‌, జెస్సీ మార్టిన్‌, పాస్టర్‌ వల్లూరి జాన్‌ ప్రసాద్‌, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, గోదాసు శిరీష పృధ్వీరాజ్‌, వనం హర్షిని పాల్గొన్నారు.

బీబీనగర్‌: అన్ని మతాలను గౌరవించుకున్నప్పుడే దేశ సమైక్యత పెంపొందుతుందని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. బీబీనగర్‌ పట్టణంలోని సీయోను ఆరాధన మందిరంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో జడ్పీటీసీ గోళి ప్రణితా పింగల్‌రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భారత దేశం ఎన్నో మతాలకు నిలయమని అన్ని మతాలను సమాన స్థాయిలో గౌరవించుకునే సంప్రదాయం ఆనాటి నేంచి నేటి వరకు కొనసాగుతూ వస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ దస్తగిరి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పంజాల సురేష్‌గౌడ్‌, నారగోని మహేష్‌గౌడ్‌, బెండ ప్రవీణ్‌, పొట్ట అంజి శ్రీశైలం, లింగేశ్‌, ఎలుగుల నరేందర్‌, చంద్రశేఖర్‌, గణేష్‌ పాల్గొన్నారు. 

తుర్కపల్లి: తుర్కపల్లి, మాధాపూర్‌, దత్తాయపల్లి, రామపురం, గొల్లెగూ డెం, వాసాలమర్రి, మల్కాపూర్‌ గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, ఎంపీటీసీ బోరెడ్డి వనజహన్మంతరెడ్డి, రాంమోహన్‌శర్మ, గిద్దె కరుణాకర్‌, బోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎరుకల వెంకటేశగౌడ్‌, కోట బిక్షపతి, దార్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. 

అడ్డగుడూరు : మండలంలోని వెల్దేవి గ్రామంలో ప్రేయర్‌ పవర్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిల్లి శ్రీకళసుందర్‌ పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేశారు. 

గుండాల: మండలకేంద్రంతో పాటు మండలంలోని వెల్మజాల, అనం తారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, మరిపడగ, తుర్కలషాపురం, బండకొత్తపల్లి తదితర గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు క్రిస్‌మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫాస్టర్‌ అనిల్‌బాబు, భాస్కర్‌, శోభన్‌, పురు షోత్తం, రమేష్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లక్కారంలో గల మహనయీమ్‌ ప్రార్థన మందిరంలో క్రిస్‌మస్‌ వేడుకలను నిర్వహించారు. పేదలకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, కౌన్సిలర్‌లు కొయ్యడ  సైదులు, కాసర్ల మంజుల పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:59:13+05:30 IST