రాజీ మార్గంతో కేసులు పరిష్కరించుకోవాలి
ABN , First Publish Date - 2021-10-21T06:14:23+05:30 IST
రాజీ మార్గంతో కేసులను పరిష్కరించు కోవాలని రామన్నపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి దుర్గా రాణి అన్నారు.
రామన్నపేట, అక్టోబరు 20: రాజీ మార్గంతో కేసులను పరిష్కరించు కోవాలని రామన్నపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి దుర్గా రాణి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందిం చిన కరపత్రాలు కోర్టు ఆవరణలో కక్షిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని చట్టాలపై అవగాహన పొందాల న్నారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగు లయ్య, ఉపాధ్యక్షుడు బి.డేవిడ్, న్యాయవాదులు జినుకుల ప్రభాకర్, బి.అశోక్, నోముల స్వామి, బి.దినేష్, మామిడి వెంకట్‌రెడ్డి, జి.నరేష్, రామన్నపేట సీఐ మోతీరాం, కోర్డు సిబ్బంది పాల్గొన్నారు.