పత్తి దొంగలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-14T06:31:34+05:30 IST

వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించి అమ్ముకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు.

పత్తి దొంగలపై కేసు నమోదు

నార్కట్‌పల్లి, అక్టోబరు 13: వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించి అమ్ముకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపారు. మండలంలోని బాజకుంట గ్రామానికి చెందిన యెల్క మల్లయ్య సాగు చేస్తున్న కౌలు భూమిలో నిల్వ ఉంచిన  7క్వింటాళ్ల పత్తిని దోమల రమేష్‌, చీమల కృష్ణ, కళ్లెం యాదగిరి కలిసి ఈనెల 10వ తేదీన రాత్రి ఆటోలో తరలించి ఆరెగూడెం గ్రామంలోని ప్రగతినగర్‌లో విక్రయించారు. బాధితడి ఫిర్యాదు మేరకు విచారణ చేసి పై ముగ్గురు వ్యక్తుల నుంచి పత్తి విక్రయించగా వచ్చిన రూ.38,000లతో పాటు 3 సెల్‌ ఫోన్‌లను స్వాధీనపర్చుకుని బుధవారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2021-10-14T06:31:34+05:30 IST