గరిడేపల్లిలో కార్డన్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2021-12-31T16:28:42+05:30 IST

మండలకేంద్రంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

గరిడేపల్లిలో కార్డన్‌ సెర్చ్‌

గరిడేపల్లి, డిసెంబరు 30: మండలకేంద్రంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కోదాడ సబ్‌ డివిజన్‌లోని 13మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీస్‌ సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రామలింగారెడ్డి మాట్లాడుతూ సైబర్‌ క్రైమ్‌ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ వంటి వివరాలు చెప్పవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:28:42+05:30 IST