వివాదంపై మాట్లాడుకోమని పిలిపించారు

ABN , First Publish Date - 2021-12-28T06:50:10+05:30 IST

సోదరు ల ఇంటి స్థలం వివాద మై మాట్లాడుకో మని పోలీసులు స్టేషనకు పి లిపించగా కొందరు ఇం టిని కూలగొట్టడంతో పాటు దోచేశారు.

వివాదంపై మాట్లాడుకోమని పిలిపించారు
నల్లగొండ పట్టణంలో కూల్చిన ఇల్లు

వివాదంపై మాట్లాడుకోమని పిలిపించారు

స్టేషనకు వెళ్లగా ఇంటిని దోచేశారు.. కూలగొట్టారు

వీధిన పడిన బాధిత కుటుంబం

నల్లగొండటౌన, డి సెంబరు 27: సోదరు ల ఇంటి స్థలం వివాద మై మాట్లాడుకో మని పోలీసులు స్టేషనకు పి లిపించగా కొందరు ఇం టిని కూలగొట్టడంతో పాటు దోచేశారు. బాధి తుడు ముక్కాలమల జంగయ్య తెలిపిన వివ రాల ప్రకారం... జంగ య్యకు నల్లగొండ పట్ట ణంలోని రాక్‌హిల్స్‌ కాలనీ రోడ్డు నెం.7లో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో జంగయ్య 30 ఏళ్లు గా నివసిస్తున్నారు. ఈ ఇంటి విషయమై జంగయ్యకు అతని తమ్ముడు నాగరాజుకు వివాదం ఉంది. ఈ వివాదంలో కొందరు జోక్యం చేసుకుని ఇంటిని కొనుగోలు చేశా మని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో జంగయ్య, ఆయన ముగ్గురు కు మారులను ఇంటి వివాదంపై మట్లాడుకోమని సోమవారం నల్లగొండ టూటౌన పో లీసులు స్టేషనకు పిలిపించారు. జంగయ్య కుటుంబ సభ్యులందరి సెల్‌ ఫోన్లను కూ డా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో జంగయ్య ఇం టిలోని నగ దు, బంగారాన్ని కొందరు దోచుకుని, ఎక్స్‌కవేటర్‌తో ఇంటిని కూలగొట్టారు. ఆ స మయంలో జంగయ్య భార్య అడ్డుపడినా వారు కనికరించలేదు. తన ఇంటిని సాగర్ల లింగస్వామి, వెంపల్ల శివకుమార్‌, మరో ఆరుగురు ఇంట్లో ఉన్న రూ.50వేల నగ దు, 10తులాల బంగారం దోచుకున్నారని, వంట పాత్రలు, మంచాలు, ఇతర వస్తువు లను ధ్వంసం చేశారని, ఎక్స్‌కవేటర్‌తో ఇంటిని కూలగొట్టారని జంగయ్య టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చే యాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-28T06:50:10+05:30 IST