వైద్యశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి బ్రేక్‌

ABN , First Publish Date - 2021-08-10T06:00:07+05:30 IST

కొత్త జోనల్‌ వ్యవస్థ అమల్లోకి రా వడంతో వైద్యఆరోగ్య శాఖలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి తాత్కాలి క బ్రేక్‌ పడింది.

వైద్యశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి బ్రేక్‌

భువనగిరిటౌన్‌, ఆగస్టు 9: కొత్త జోనల్‌ వ్యవస్థ అమల్లోకి రా వడంతో వైద్యఆరోగ్య శాఖలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి తాత్కాలి క బ్రేక్‌ పడింది. 42 ఏఎన్‌ఎం, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్ల పో స్టులకు మొత్తం 631 దరఖాస్తులు వచ్చాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10న డ్రాఫ్ట్‌, 11న తుది మెరిట్‌ జాబితా విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జిల్లా కేడర్‌లో ఉన్న పోస్టులన్నీ నూతన విధానంలో జోనల్‌ కేడర్‌లోకి వెళ్లాయి. అంతేగాక పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ పరి ధి నుంచి జోనల్‌ సెలక్షన్‌ కమిటీకి వెళ్లింది. దీంతో ఈ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అర్హుల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తారా, లేక పాతదే కొనసాగిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు తదుపరి నిర్ణ యం తీసుకుంటామని డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు.

Updated Date - 2021-08-10T06:00:07+05:30 IST