వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు షురూ
ABN , First Publish Date - 2021-10-20T06:31:55+05:30 IST
జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

సూర్యాపేట కల్చరల్, అక్టోబరు 19 : జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ట, ద్వార, తోరణ, ధ్వజ, కుంభ ఆరాధనలు నిర్వహించారు. ధ్వజారోహణ, గరుఢ ముద్ద బలిహరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎరువ శ్రీనివా్‌సరెడ్డి, అర్చకులు నల్లాన్ చక్రవర్తుల హరిచరణ్‌ఆచార్యులు, సునీల్‌కుమార్‌ఆచార్యులు, ఫణికుమారాచార్యులు, శరత్‌కుమారాచార్యులు, టీఎ్‌సవీ సత్యనారాయణ, గజ్జెల రవీందర్, బజ్జూరి క్రిష్ణయ్య, అరుణమ్మ, జ్ఞానకుమారి, మంజుల, సుహాసిని, రజిత, వాసవి, అరుణ పాల్గొన్నారు.
