వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురి అదృశ్యం

ABN , First Publish Date - 2021-11-23T06:41:18+05:30 IST

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురు అదృశ్యమయ్యారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురి అదృశ్యం
సీతారాములు(ఫైల్‌)

తిరుమలగిరి/సూర్యాపేట క్రైం, నవంబరు 22: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురు అదృశ్యమయ్యారు. తిరుమలగిరి ఎస్‌ఐ ఉపేం దర్‌ తెలిపిన వివరాల ప్రకారం..  మునిసిపా లిటీ  కేంద్రానికి చెందిన పాము సరిత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు.  ఆమెకు భర్త, 11ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. భర్త మహేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు

సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి బొంత సీతారాములు అదృశ్యమ య్యాడు. సూర్యాపేట కొత ్తబస్‌స్టేషన్‌ సమీపంలోని వాటర్‌ప్లాంట్‌లో పని చేసే సీతారాములు  రోజు మాదిరిగానే ఈనెల 11వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి బయటివెళ్లి తిరిగిరాలేదు. సీతారాములు భార్య రమణ  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ పడి శాల శ్రీనివాస్‌ తెలిపారు. అతడి ఆచూకీ గుర్తించినవారు సెల్‌ నెం. 9440795627, 7901110735, 8897457012కు  సమాచారం ఇవ్వాలన్నారు.
Updated Date - 2021-11-23T06:41:18+05:30 IST