పుస్తకం.. సర్వజన నేస్తం

ABN , First Publish Date - 2021-04-23T06:32:08+05:30 IST

‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అ న్నారు కందుకూరి వీరేశలింగం పంతులు.. అదీ పుస్తకం గొప్పతనం. పుస్తకం మనకు జ్ఞానా న్ని ప్రసాదిస్తుంది.

పుస్తకం.. సర్వజన నేస్తం

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అ న్నారు కందుకూరి వీరేశలింగం పంతులు.. అదీ పుస్తకం గొప్పతనం. పుస్తకం మనకు జ్ఞానా న్ని ప్రసాదిస్తుంది. సన్మార్గాన నడిపిస్తుంది. మనిషి జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలంటారు. అం దుకే పుస్తక పఠన ప్రభావంతోనే ఎందరో మహా నుభావులు  సమాజానికి మార్గనిర్ధేశనం చే శా రు. అలాంటి మహాపురుషుల జీవిత పుస్తకాలు చదివి ఎందరో జీవితాలను సార్థకం చేసుకున్నారు. 

భూదాన్‌పోచంపల్లి/నార్కట్‌పల్లి/ హుజూర్‌నగర్‌, ఏప్రిల్‌ 22: మనలో చాలా మందికి పుస్తక పఠనం మంచి వ్యసనమే. ఎందుకంటే పుస్త కపఠనం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని అనేక పరి శోధనల ద్వారా తేటతెల్లమైంది. ఒంటరిగా ప్రయాణిస్తున్నపుడో, ఏమీ తోచ నపుడో నీకు తోడుగా నేనున్నానంటూ నిలిచేది పుస్తకం. అందుకే ఒక మం చి పుస్తకం వందమంది నేస్తాలతో సమానం అనికూడా చెబుతారు. వా స్తవానికి ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానప్రసాదం జరగడంలో పుస్త కాల పాత్ర కీలకం. ఒకప్పుడు ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పుస్తకాలను చదు వుతారు అనేదాన్ని బట్టి అతని మేధాశక్తిని, ప్రతిభను అంచనా వేసేవారు. అసలు గతంలో ప్రతి ఇంట్లో ఆడ, మగ తేడా లేకుండా పుస్తకపఠనం నిత్యకృత్యంగా కనిపించేది. అది రామాయణ, భారత, భాగవతాల వంటి పురాణ ఇతిహాసాలు కావచ్చు, నవలలు, వారపత్రికలు, మాస పత్రికలు కా వచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల కోసం కూడా చందమామ, బాలమిత్ర వంటి ఎన్నో పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండేవి. రేడియో, టీవీ వంటి ఎలక్ర్టానిక్‌ మాధ్యమాలు, ఇంటర్నెట్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల ప్రవేశంతో పుస్తకపఠనం గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. అందుకే మనకు దర్శనమిచ్చే మహనీయుల విగ్రహాల చేతుల్లో పుస్తకాలు ఉంటాయి. మహాత్మాగాంధీ చేతిలో ‘భగవద్గీత’, జ్యోతిరావు పూలే చేతిలో ‘గులాంగిరీ’, డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ చేతిలో ‘భారత రాజ్యాంగం’ దర్శనమిస్తుంటాయి. వారే కాదు.. నాటి స్వాతంత్య్ర యోధులు భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వంటి వారందరూ పుస్తకాలు విపరీతంగా చదివినవారే. అందుకే వారందరూ చరిత్ర పుస్తకాల్లో పేజీలయ్యారు. ఆధునిక కాలంలో పుస్తక పఠనం తగ్గిపోతోంది. ఫలితంగా సమాజ స్థితిగతులు పక్కదారి పడుతున్నాయని ప్రపంచంలోని మేధావులు గుర్తించారు. మానవ మస్తిష్కాల్లో విలువలను నింపాలంటే పుస్తకపఠనం అత్యావశ్యకమని యునెస్కో గుర్తించింది. 


యువతలో పఠానాసక్తి పెరగాలి

ప్రస్తుతం గ్రంథాలయాన్ని యువత కేవంల పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను చదవటానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వారికి ఇతర పుస్తకాలు అంటే వివేకానందుడు, మహాత్మా గాంధీ, జ్యోతిరావుపూలే, జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వంటి మహనీయుల చరిత్రలను, మన సంస్కృతి సంప్ర దాయాలను తెలిపే గ్రంథాలను కూడా చదివే దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. దీనికోసం అవసరమైతే పుస్తక పఠన ప్రాధాన్యతను యువతకు తెలియజేస్తూ సాహిత్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వర్క్‌షాప్‌లను, పుస్తక ప్రదర్శనలను నిర్వహించాలి. నేటితరం పుస్తకపఠనం వైపు దృష్టిసారించినప్పుడే పుస్తకం ముందు తరాలకు అందుతుంది. 

రఘునందన్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు.

 

రంగనాయకమ్మ పుస్తకాన్ని చదివి ఎంతో మార్పు చెందా 

ముప్పాళ్ళ రంగనాయకమ్మ పుస్తకం చదివి ఎంతో మార్పు చెందాను. ఆ పుస్తకంలో నేటి సమాజంలో చివరి పయనం ఎటువైపో అని రాసిన అక్షరాలు మనిషిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించాయి. కమ్యూనిజంపైన ఆ పుస్తకంలో ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలు పొందుపర్చారు. ప్రపంచ మానవాళి వ్యవస్థ ఎటు పోతుంది. ఆది మానవుడిగా పుట్టిన మనిషి ఎన్నో మార్పులు చెందాయి. రాజ్యాలు ఏర్పాటుచేసుకుని ఘన రాజ్యాలు నిర్మించడంతో పాటు ఆఖరికి మనిషి సమసమాజ స్థాపన వైపు నడవాలని రంగనాయకమ్మ పుస్తకంలో రాశారు. వీటితో పాటు రామాయణం విష వృక్షం, బలిపీఠం లాంటి పుస్తకాలు చదివి ఎంతో మార్పు చెందాను. చరిత్ర అధ్యాపకునిగా విద్యార్థులకు పుస్తకాలలోని ఎన్నో కథనాలను వివరించి చైతన్యవంతం చేశా.  

అర్వపల్లి రంగారావు, చరిత్ర అధ్యాపకుడు హుజూర్‌నగర్‌.


ఉపాధ్యాయుడివైపు నడిపించింది కందుకూరి పుస్తకం 

నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు.  సంఘ సంస్కర్త  కందుకూరి వీరేశ లింగం పంతులు జీవిత చరిత్రను తెలిపే పా ఠ్యాంశం, అతని రచనలు నన్ను ఎంతగానో ప్ర భావితం చేశాయి. బాల్య వివాహాలను రూపుమాపటం, వితంతు వివాహాలు జరిపించడం, అతి వలు అబలలు కాదు సబలలంటూ వారికి విద్యాబోధన చేయడం, వారికోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేస్తూ సంఘంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆదర్శనీయుడైన కందుకూరి జీవితమే ఆయనలా ఉపాధ్యాయుడిని కావాలనే బలమైన కాంక్షను నాలో ప్రభావితం చేసి ంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుని పట్టుదలతో సాధించా. ఉపా ధ్యాయునిగా తరగతి గదుల్లో చెప్పే పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పే మహనీయుల పుస్తకాలు చదివి, విద్యార్థులకూ సూచించా. 

రాధారపు బిక్షపతి, విశ్రాంత తెలుగు భాషాపండితుడు, నార్కట్‌పల్లి.


నన్ను ప్రేరేపించిన పుస్తకం‘ సీక్రెట్‌’

మానవుని ఆలోచనలకు, విశ్వాసానికి అవినా భావ సంబంధం ఉందని, ఈ భౌతిక ప్రపంచంతో మనిషి మేధస్సు అనుసంధానం కలిగి ఉందని అమెరికన్‌ రచయిత్రి రోండా బైర్న్‌ ‘సీక్రెట్‌’ అనే ఆంగ్ల పుస్తకంలో పేర్కొ న్నారు. ఈ పుస్తకం ప్రపంచంలోని 50కి పైగా భాషలలో కోట్లాది ప్రతులను అమ్మగలిగింది. 21వ శతాబ్ధం లో అత్యంత ప్రభావవంతమైన పుస్తకంగా పేరొందింది. మనిషి జీవితం తాను కోరుకున్నదేనని, నేడు వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో అది అతని ఆకాం క్షలకు ప్రతిరూపమని అంటారు. మనం కోరుకున్నదే ఈ జీవితం. రేపు ఎలా ఉండాలో దానిని భావించుకుంటే అదే వాస్తవంలోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘యద్భావం.. తద్భవతి’. సృష్టిలోకి మనం ఏదైనా సందేశం పంపిస్తే అది వాస్తవ రూపంలోకి వస్తుంది. రహస్యం (సీక్రెట్‌) పుస్తకం మాత్రం నాకు ఎంతో స్ఫూర్తిదాయకం.

తడక యాదగిరి, నిజాం కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Updated Date - 2021-04-23T06:32:08+05:30 IST