బీఎనరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-05-10T06:59:05+05:30 IST

తెలంగాణ పోరాటయోధుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు బీంరెడ్డి నర్సింహారెడ్డి ఆశయ సాధనకు యువత ముందుకు సాగాల ని ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ అన్నారు.

బీఎనరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలి
భీంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జోహర్లు అర్పిస్తున్న నాయకులు

ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌
మిర్యాలగూడ, మే 9 :
తెలంగాణ పోరాటయోధుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు  బీంరెడ్డి నర్సింహారెడ్డి ఆశయ సాధనకు యువత ముందుకు సాగాల ని ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక రామచంద్రయ్యగూడెం వైజంక్షనలో ఎంసీపీఐ (యు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు ఉండాలని, సామాజిక న్యాయం కోసం పోరు సాగించిన తొలి నాయకుడు బీంరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట కేం ద్రంగా సామాజిక న్యాయం పోరాటానికి అంకురార్పణ గావించారన్నారు. తెలం గాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దండును నడిపి వేలాది ఎకరాలు పేదల కు పంచాడని కొనియాడారు.  శ్రమజీవులకే కష్టఫలితం దక్కాలన్న బీఎనరెడ్డి ఆశయసాదనకు అన్ని వర్గాల వారు,కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ కడదాక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన  బీంరెడ్డి సేవలు మరువలేనివన్నా రు. బీఎనరెడ్డి  ఎంపీగా పార్లమెంట్‌లో పోరాడి బీబీనగర్‌ నుంచి రామన్నపేట, చిట్యాల మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించారన్నారు.దీంతో  మిర్యాలగూడ ప్రాంతంలో రైస్‌ ఇండసీ్ట్ర, వాపార వాణిజ్య పరం గా మరింతగా అభివృద్ధి చెందిందన్నారు.   సభకు ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత రాంచందర్‌నాయక్‌, ఏఎంసీ చైర్మన చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, వామపక్ష నేతలు డబ్బికార్‌ మల్లేష్‌, బంటు వెంకటేశ్వర్లు, తాండ్ర కుమార్‌, వనం సుధాకర్‌, వస్కుల సైదమ్మ, భరత, కాశీ  సామాజిక వేత్త జాడి రాజు,  మల్లు గౌతంరెడ్డి, గాదె పద్మ, నిడమనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన కామెర్ల జానయ్య, కాసుల సత్యం,  దారం మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:59:05+05:30 IST