అంధ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి

ABN , First Publish Date - 2021-12-07T07:03:52+05:30 IST

అంధ విద్యార్థులు 6-16 ఏళ్లలోపు వారు విధిగా పాఠశాలల్లో చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా షీటీమ్‌ ఏఎ్‌సఐ విజయలక్ష్మి అన్నారు.

అంధ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి

షీటీమ్‌ ఏఎ్‌సఐ విజయలక్ష్మీ

నల్లగొండ క్రైం, డిసెంబరు 6: అంధ విద్యార్థులు 6-16 ఏళ్లలోపు వారు విధిగా పాఠశాలల్లో చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా షీటీమ్‌ ఏఎ్‌సఐ విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంధుల పాఠశాల్లో షీటీమ్‌ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు షీటీమ్‌ కార్యక్రమాల గురించి అవగాహన సోమవారం కల్పించారు. ఈ సందర్భంగా కళాకారులు పలు గేయాలను ఆలపించి విద్యార్థులకు పలు విషయాలను అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ సందర్భంగా ఏఎ్‌సఐ విజయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులమని కుంగిపోకుండా కష్టపడి ఉన్నతంగా ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు మాట్లాడుతూ పోలీ్‌సశాఖ 12వ బెటాలియన్‌ నుంచి ప్రతినెల రూ.25వేల విరాళం అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటీమ్‌ బృందం ఎస్‌కె హుస్సేన్‌, చంద్రశేఖర్‌, సత్యం, పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T07:03:52+05:30 IST