నల్లబెల్లం, పటిక స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-21T05:56:05+05:30 IST

సారా తయారీకి ఉపయోగిం చే నల్లబెల్లం, పటికను కారులో తరలిస్తుండగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎక్స్‌ రోడ్డు వద్ద ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు.

నల్లబెల్లం, పటిక స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

నల్లగొండ క్రైం, జూన్‌ 20: సారా తయారీకి ఉపయోగిం చే నల్లబెల్లం, పటికను కారులో తరలిస్తుండగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎక్స్‌ రోడ్డు వద్ద ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ భరత్‌భూషన్‌ ఆదివారం వెల్లడించారు. తుంగతుర్తికి చెందిన గుగులోతు సురేష్‌ సారా తయారీకి వాడే సుమారు 400 కిలోల బెల్లం, 50కేజీల పటికను కారులో తరలిస్తుండగా తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. నల్ల బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకొని కారును సీజ్‌ చేశారు. సమావేశంలో సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐలు రాఘవేందర్‌, మల్లేష్‌, సిబ్బంది ముదిరెడ్డి శేఖర్‌రెడ్డి, బ్రహ్మం, నాగరాజు, రమేష్‌, నాగమ్మ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-21T05:56:05+05:30 IST