బయో చీటింగ్‌

ABN , First Publish Date - 2021-05-20T06:58:22+05:30 IST

నల్లగొండ పట్టణానికి చెందిన ఓ వైట్‌ కిరోసిన్‌ డీలర్‌ బయోడీజిల్‌ పేరిట తెలుగు రాష్ట్రా ల్లో అక్రమ దందా కొనసాగిస్తున్నాడు. నార్కట్‌ప ల్లి కేంద్రంగా కల్తీ డీజిల్‌ తయారుచేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్‌బంక్‌లకు సరఫరా చేస్తున్నా రు. డీజిల్‌ కంపెనీల అధికారుల సహకారంతో ఆయన రూ. కోట్లకు పడగలెత్తాడు. వైట్‌ కిరోసిన్‌ పేరిట లైసె న్సు తీసుకొని కల్తీ డీజిల్‌ సరఫ రా చేస్తున్నాడు. అక్రమాలపై పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

బయో చీటింగ్‌

బయోడీజిల్‌ పేరిట డీజిల్‌ కల్తీ 

నార్కట్‌పల్లి కేంద్రంగా అక్రమ వ్యాపారం 

వైట్‌ కిరోసిన్‌ ఏజెంటే సూత్రధారి

బయోడీజిల్‌ పేరిట రూ.కోట్లలో అక్రమార్జన

పెట్రోల్‌ కంపెనీల అధికారులతో మిలాఖత్‌

గుంటూరు, విజయవాడకు విస్తరించిన వ్యాపారం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన ఓ వైట్‌ కిరోసిన్‌ డీలర్‌ బయోడీజిల్‌ పేరిట తెలుగు రాష్ట్రా ల్లో అక్రమ దందా కొనసాగిస్తున్నాడు. నార్కట్‌ప ల్లి కేంద్రంగా కల్తీ డీజిల్‌ తయారుచేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్‌బంక్‌లకు సరఫరా చేస్తున్నా రు. డీజిల్‌ కంపెనీల అధికారుల సహకారంతో ఆయన రూ. కోట్లకు పడగలెత్తాడు. వైట్‌ కిరోసిన్‌ పేరిట లైసె న్సు తీసుకొని కల్తీ డీజిల్‌ సరఫ రా చేస్తున్నాడు. అక్రమాలపై పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

తిన్నర్‌, టర్పెన్‌టాయిల్‌, వైట్‌ కిరోసిన్‌, ఎల్‌డీఓ (లో డెన్సిటీ ఆయిల్‌) వీటన్నింటినీ కలిపి బయోడీజిల్‌ ను శుద్ధిచేసే ఓ రసాయనాన్ని కలిపి బయోడీజిల్‌ త యారు చేయడం ఈ అక్రమార్కుడి పని. వెయ్యి లీటర్ల ఒరిజినల్‌ డీజిల్‌లో 200 లీటర్ల వరకు ఈ కల్తీ డీజిల్‌ కలిపేస్తారు. వివిధ డీజిల్‌ కంపెనీల అధికారులతో కుమ్మక్కై కంపెనీ నుంచి వెయ్యిలీటర్లు వస్తే కల్తీ డీజి ల్‌ 200లీటర్లు కలిపేసి పెట్రోల్‌ బంకుల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉండటంతో విషయం వెలుగులోకి రాలేదు. వైట్‌ కిరోసిన్‌ విక్రయించేందుకు అఽధికారికంగా లైసెన్స్‌ పొందిన ఈ వ్యాపారి బడా కంపెనీలకు వైట్‌ కిరోసిన్‌ విక్రయిస్తూ కొంత పక్కదారి పట్టించి దానికి వివిధ రకాల రసాయనాలు కలిపి డీజిల్‌ను తయారుచేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బయోడీజిల్‌ ఉత్ప త్తికి తనకు అనుమతులు ఉన్నాయంటూ పోలీసులను సైతం బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. తన సరు కు నిల్వ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ సదరు కల్తీరాయుడు నార్కట్‌పల్లి పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేయడం, తాము పని ఒత్తిడిలో ఉన్నామని చెప్పగా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పే ప్రయత్నం చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అసలు ఏం జరుగుతుందో ఆరా తీయగా ఇదేదో పెద్ద రాకెట్‌ ఉన్నట్లు భావించిన నార్కట్‌పల్లి పోలీసులు విషయాన్ని ఎస్పీ రంగనాథ్‌ వద్దకు చేర్చారు. ఆయన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి అప్పగించి లోతుగా ఆరా తీయ డం ప్రారంభించగా, భారీ రాకెట్‌కు సంబంధించి పలు విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.


తెలుగు రాష్ర్టాల్లో 

డీజిల్‌ సరఫరా చేసే ప్రముఖ కంపెనీల పేరిట ఈ అక్రమార్కుడు 12 ట్యాంకర్లు సృష్టించాడు. వాటితో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సరఫరా చేస్తున్నాడు. జిల్లాలోనూ బయోడీజిల్‌ పేరిట అవుట్‌లెట్లు పెట్టాడు. కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా, ఆ మేరకు లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకర్లు  ఎందుకు స్పందించలేదు. ప్రముఖ డీజిల్‌ కంపెనీల అధికారులు కల్తీ డీజిల్‌ వస్తున్న సంగతిని ఎందుకు నొక్కిపెట్టారు ? కంపెనీల నుంచి పెట్రోల్‌ బంక్‌లకు వస్తున్న స్టాక్‌కు బంకుల్లో విక్రయిస్తున్న స్టాక్‌కు కొన్ని సంవత్సరాలుగా తేడా ఉన్న కంపెనీల సేల్స్‌ ఆఫీసర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు ? వంటి వివరాలను టాస్క్‌ఫోర్స్‌ టీం లోతుగా విచారణ చేస్తోంది. 2014 నుంచి ఈ అక్రమార్కుడు దందా చేస్తున్నట్లు సమాచారం. మొదట సూర్యాపేట కేంద్రంగా అక్రమ వ్యాపారం చేయగా, అక్కడ పోలీసులకు చిక్కి కొంతకాలం తర్వాత నార్కట్‌పల్లికి చేరి తప్పుడు కాగితాలతో అధికారులను దారి మళ్లించినట్లు సమాచారం. అక్రమార్కుడి సతీమణిది కూడా ఈ వ్యాపారంలో కీలక పాత్ర, నగదు నిర్వహణ పనులన్నీ ఆమె చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుని ఆస్తులు రూ.కోట్లలో ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు పెద్దలు అక్రమార్కుడికి అండగా పైరవీలు మొదలు పెట్టినట్లు సమాచారం. చిన్నపాటి కేసు పెట్టి వదిలేయాల్సిందిగా అధికార పార్టీ నేతలు పోలీసు సిబ్బందిపై ఒత్తిడి ప్రారంభించారు. అయినా పోలీసు అధికారులు లెక్కచేయకపోవడంతో  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలిసింది. 

Updated Date - 2021-05-20T06:58:22+05:30 IST