భువనగిరి వైద్యురాలు డాక్టర్ స్నేహకు గోల్డ్ మెడల్
ABN , First Publish Date - 2021-10-29T06:49:59+05:30 IST
భువనగిరి హూసేనాబాద్‌కు చెంది న డాక్టర్ స్నేహ కు ఎండి పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల విభాగం)లో గోల్డ్ మెడల్ సాధించింది
భువనగిరిటౌన, అక్టోబరు 28: భువనగిరి హూసేనాబాద్‌కు చెంది న డాక్టర్ స్నేహ కు ఎండి పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల విభాగం)లో గోల్డ్ మెడల్ సాధించింది గురువారం కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వెల్లడించిన పీజీ ఫలితాల్లో కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాలలో చిన్నపిల్లల విభాగంలో పీజీ పూర్తి చేసిన ఆమె యూనివర్సిటీ పరిధిలో అత్యఽధిక మార్కులతో గోల్డ్ మెడల్ సాధించింది. చిన్నపిల్ల ల విభాగంలో సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసి గ్రామీణ, పేద పిల్లలకు వైద్య సేవలందించడం తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆమె భర్త డాక్టర్ సుదీ్‌పరెడ్డి కూడా చిన్నపిల్లల వైద్య నిపుణుడే. గోల్డ్‌మెడల్ సాధించిన స్నేహను పలువురు అభినందించారు.