కరోనాతో మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ భాస్కర్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-28T05:42:30+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ పట్టణానికి చెందిన నెమ్మాది భాస్కర్‌(37) కరోనాతో సోమవారం మృతి చెందాడు.

కరోనాతో మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ భాస్కర్‌ మృతి
నెమ్మాది భాస్కర్‌

కోదాడ, డిసెంబరు 27 : టీఆర్‌ఎస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ పట్టణానికి చెందిన నెమ్మాది భాస్కర్‌(37) కరోనాతో సోమవారం మృతి చెందాడు. 40 రోజు లుగా హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ మాట్లా డుతూ భాస్కర్‌ మృతి పార్టీకి తీరనిలోటన్నారు. భాస్కర్‌ మృతికి టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-12-28T05:42:30+05:30 IST