భగత్‌సింగ్ జీవితం ఆదర్శనీయం
ABN , First Publish Date - 2021-03-24T06:31:20+05:30 IST
భగత్‌సింగ్ జీవితం ఆదర్శనీయమని, ఆయన త్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు నోముల వెంకటేశ్వర్లు అన్నారు.

కోదాడ/ కోదాడరూరల్/ హుజూర్‌నగర్/ చింతలపాలెం/ పాలకవీడు/ నడిగూడెం/ మునగాల/ నేరేడుచర్ల, మార్చి 23: భగత్‌సింగ్ జీవితం ఆదర్శనీయమని, ఆయన త్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు నోముల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కళాశాలలో ఎస్‌ఎ్‌సఎస్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఆనంద్‌కుమార్, రామారావు, రఫీ, విద్యార్థులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్‌రోడ్డులోని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మేధరమెట్ల వెం కటేశ్వరరావు, వెలిది పద్మావతి, ముత్యాలు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పాలకూరిబాబు, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చింతలపాలెంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తెల నారయణరెడ్డి, దొంగల అంకరాజు, వీరబాబు పాలొన్నారు. పాలకవీడు మండల కేంద్రంలో మంగళవారం భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మట్టయ్య, ఏసురత్నం, నాగయ్య, మరియదాసు పాల్గొన్నారు. నడిగూడెం మండలంలోని నడిగూడెం, కరవిరాల, బృందావనపురంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యానారాయణ, డీవైఎ్‌ఫఐ కార్యదర్శి కేశగాని భద్రయ్య, బీరవోలి సుధాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, కొరట్ల ప్రపాద్, వెంకటనారాయణ, మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. మునగాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చిలంచర్ల ప్రభాకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జె.నరసింహారావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి సిహెచ్.సీ తారాం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాఘవరెడ్డి, డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవర్ శ్యాం, గడ్డం వినోద్, ఏఐఎస్‌ఎఫ్ మండల నాయకులు వేణు, అక్బర్ పాష పాల్గొన్నారు. నేరేడుచర్లలో ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కొమర్రాజు వెంకట్, ఎడ్ల సైదులు, ఊదర వెంకన్న, భరత్‌కుమార్, రమేష్, గోపి, నాగరాజు పాల్గొన్నారు.