అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-12-28T06:19:58+05:30 IST

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలందించాలని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ ఫోన్లు, చీరలు కలెక్టరేట్‌లో సోమవారం పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలి
అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌

సూర్యాపేట (కలెక్టరేట్‌), డిసెంబరు 27: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలందించాలని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ ఫోన్లు, చీరలు కలెక్టరేట్‌లో సోమవారం పంపిణీ చేశారు. జిల్లాలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపం నివారణకు సరైన సమయంలో పోషకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలోని 1,209 అంగన్‌వాడీ వర్కర్లు, 48మంది సూపర్‌వైజర్లకు చీరలు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం బాల రక్ష వాహనాన్ని ప్రారంభించారు. అవసరమున్న పిల్లల రక్షణకు వాహన సేవలను పూర్తిగా వినియోగించాలన్నారు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఐసీడీఎస్‌ జ్యోతిపద్మ, సంపత్‌, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-28T06:19:58+05:30 IST