జాతీయ సమస్యలపై నిరంతర ఆందోళనల కమిటీ సభ్యుడిగా ఉత్తమ్‌

ABN , First Publish Date - 2021-09-03T06:32:47+05:30 IST

కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమస్యలపై నిరంతరం నిర్వహించే ఆందోళనల కమిటీ సభ్యుడిగా నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎంపికయ్యారు.

జాతీయ సమస్యలపై నిరంతర ఆందోళనల కమిటీ సభ్యుడిగా ఉత్తమ్‌

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 2: కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమస్యలపై నిరంతరం నిర్వహించే ఆందోళనల కమిటీ సభ్యుడిగా నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఈ కమిటీని గురువారం ప్రకటించారు. దిగ్విజయ్‌సింగ్‌ చైర్మన్‌గా ఉన్న ఈకమిటీలో ప్రియాంక గాంధీతోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉండగా, అందులో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటుదక్కింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎంపీ ఉత్తమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.   


Updated Date - 2021-09-03T06:32:47+05:30 IST