కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-05T06:40:35+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివిధ గ్రా మాల్లో ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
శాలిగౌరారం మండలం తుడిమిడిలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న సర్పంచ్‌ రజిత

దేవరకొండ/ శాలిగౌరారం/ మిర్యాలగూడ టౌన్‌/ చిట్యాల రూరల్‌/ కొండమల్లేపల్లి/ మర్రిగూడ/ వేములపల్లి/, మే 4: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివిధ గ్రా మాల్లో ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా దేవరకొండ మండలం తాటికోలు సర్పంచ్‌ జూలూరి ధనలక్ష్మీ బాలనారాయణగౌడ్‌ గ్రామంలో హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. కరోనాతో అనేక మ ంది మృత్యువాత పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇం ట్లోనే ఉండాలని, మాస్కులు ధరించాలని, కోరారు. శాలిగౌరారం మండలంలోని తుడిమిడిలో సర్పంచ్‌ చెలకాని రజితకొమరయ్య గ్రామంలో హైడ్రోక్లోరిక్‌ పిచికారీ చేయించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌, భౌతికదూరం పాటించటంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పరుశురాములు, పంచాయితీ కార్యదర్శి నరేందర్‌ ఉన్నారు. మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో వాసవీ సేవాసమితి మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు రాయపుడి ఆశాలత జగన్‌ మోహన్‌ మాట్లాడారు. మానవసేవే మాధవ సేవని, ఈ ఆపద సమ యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసా రమేష్‌, గౌరు విజయ్‌కుమార్‌, బొలుసాని కృష్ణయ్య, పరమేష్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిట్యాల పీహెచ్‌సీలో ఎంపీపీ కొలను సునీతవెంకటేష్‌గౌడ్‌ దంపతులు వాక్సిన్‌ తీసుకున్నారు. కొండమల్లేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద ఉదయం ఏడు గంటల నుంచే కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దేవరకొండ మండలం నుంచి కరోనా పరీక్షలు చేయిం చుకునేందుకు అధిక సంఖ్యలో కొండమల్లేపల్లికి వచ్చారు. 128 మందికి పరీక్షలు నిర్వహించగా 58మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి నట్లు వైద్యులు రసూల్‌, భరత్‌సింగ్‌ తెలిపారు. మర్రిగూడ మండలంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుండడంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కరోనా బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని కార్యా లయాల్లో తక్కువ సిబ్బంది ఉండడం వల్ల అందులో సగం మందికి కరోనా రావడంతో ఉన్న సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాల పనులు నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కరోనా టీకా కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో కాని, మీసేవ కేంద్రంలో దరఖాస్తుచేసుకోవాలని మర్రిగూడ ఆస్పత్రి డాక్టర్‌ రాజేష్‌ కోరారు. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో కరోనా బారిన పడిన వారికి జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య పండ్లు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా బారిన పడిన కుటుంబాలకు సహాయం చేస్తున్నామన్నారు. గ్రామాల్లో కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు అందించే సలహాలు, సూచనలను పాటిస్తే కరోనాను జయించవచ్చని తెలిపారు. 

· వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 84మందికి కరోనా  నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 14మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి ముస్తక్‌అహ్మద్‌ తెలిపారు.

· కట్టంగూర్‌ పీహెచ్‌సీలో 52మందికి పరీక్షలు నిర్వహించగా 14మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి నెహ్రునాయక్‌ తెలిపారు. 

· శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 100 మందికి పరీక్షలు నిర్వహించగా 22మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 

· చిట్యాల మండలం వెలిమినేడు పీహెచ్‌సీలో 67మందికి పరీక్షలు చేయగా 23మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

· పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి, పిఏపల్లి పీహెచ్‌సీలో 234 మందికి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో 52 మందికి కరోనా పాజిటివ్‌  నమోదు అయినట్లు వైధ్యాధికారులు తెలిపారు.

ఫ చింతపల్లి మండలంలో 42 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చింతపల్లి పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ అలీం తెలిపారు.

Updated Date - 2021-05-05T06:40:35+05:30 IST